కీర్తిశేషులు గణేశుల వరలక్ష్మి గారి జ్ఞాపకార్థం కాకినాడ రోటరీ చేయూత భవన్లో చిన్నారులకు భోజనాలు&పుస్తకాలు పెన్నులు పంపిణీ

BLOG ARTICLE

కీర్తిశేషులు గణేశుల వరలక్ష్మి గారి జ్ఞాపకార్థం కాకినాడ రోటరీ చేయూత భవన్లో చిన్నారులకు భోజనాలు&పుస్తకాలు పెన్నులు పంపిణీ

వారి కుమార్తె శ్రీమతి బూర్లు శివగంగ పార్వతి గారు అమ్మగారి మీద ప్రేమతో వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తూ..రోటరీ చేయూత భవన్లో చిన్నారులకు భోజనాలు మరియు పుస్తకాలు పంపిణీ సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది 🙏

🙏 మానవత్వమే మహోన్నత సేవ 🙏

కీర్తిశేషులు శ్రీమతి గణేశుల వరలక్ష్మి గారి పవిత్ర జ్ఞాపకార్థం…

వారి కుమార్తె శ్రీమతి బూర్లు శివగంగ పార్వతి గారు తమ అమ్మగారి జ్ఞాపకార్థం గొప్ప మనసుతో, గురజనాపల్లి గ్రామానికి చెందిన మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ రోటరీ చేయూత భవన్‌లోని చిన్నారులకు రాత్రి భోజనంతో పాటు పుస్తకాలు, పెన్నులు అందించాలని కోరడం ఎంతో అభినందనీయం.

తన తల్లిగారి జ్ఞాపకాలను సేవా కార్యక్రమం రూపంలో పదిలపరుస్తూ, చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు నింపాలనే వారి గొప్ప ఆలోచన నిజంగా ప్రశంసనీయం. ❤️

ఈ గొప్ప దయాహృదయంతో కూడిన సేవా కార్యక్రమానికి సహకరించిన శ్రీమతి బూర్లు శివగంగ పార్వతి గారికి మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు మరియు ప్రత్యేక అభినందనలు. 🙏

అదేవిధంగా కీర్తిశేషులు శ్రీమతి గణేశుల వరలక్ష్మి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము.

🙏 ఓం శాంతి… శాంతి… శాంతిః 🙏

ఇట్లు
మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ
గురజనాపల్లి